Published : 30/11/2021 05:10 IST

భవిష్యత్‌లో కీలకంగా జలవనరుల నిర్వహణ

కేంద్ర జల్‌శక్తి అదనపు కార్యదర్శి దేవశ్రీ ముఖర్జీ

ఈనాడు, హైదరాబాద్‌: జలవనరుల సంరక్షణ అనేది మున్ముందు అనేక సవాళ్లతో కూడుకున్నదని కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వశాఖ అదనపు కార్యదర్శి దేవశ్రీ ముఖర్జీ అన్నారు. సోమవారం భారత్‌, ఆస్ట్రేలియాల భాగస్వామ్యంతో చేపట్టిన ‘ఇండియా యంగ్‌ వాటర్‌ ప్రొఫెషనల్‌ ప్రోగ్రాం’ కార్యక్రమాన్ని ఆన్‌లైన్‌ ద్వారా ప్రారంభించారు. ప్రారంభ సమావేశంలో ఆమె మాట్లాడుతూ నీటి నిర్వహణలో శాస్త్రసాంకేతికత అవసరం ఉందని, ఆస్ట్రేలియా భాగస్వామ్యం ద్వారా జలవనరుల నిర్వహణ బలోపేతం అవుతుందని వివరించారు. రెండు దేశాలు సంయుక్తంగా చేపట్టిన ప్రాజెక్టులో శిక్షణకు ఎంపికైన యువ నిపుణులు నీటిసంరక్షణలో సామర్థ్యాలను చాటాల్సిన అవసరం ఉందని సూచించారు. సంయుక్త కార్యదర్శి సుభాష్‌ యాదవ్‌ మాట్లాడుతూ క్షేత్రస్థాయి పరిస్థితులపై అధ్యయనం చేయడం ద్వారా నీటివనరుల వినియోగం, అవసరాలు, సంరక్షణపై స్పష్టమైన అవగాహన వస్తుందన్నారు. గౌహతి ఐఐటీ ఆచార్యుడు ఆచార్య టీజీ సీతారాం మాట్లాడుతూ.. దేశం నుంచి 15, ఆస్ట్రేలియా నుంచి 8 విశ్వవిద్యాలయాలకు ఈ ప్రాజెక్టులో భాగస్వామ్యం ఉందన్నారు. ప్రతిష్ఠాత్మక ఐఐటీ ఖరగ్‌పుర్‌, హైదరాబాద్‌ నుంచి జేఎన్‌టీయూ ఉన్నాయన్నారు. ఆస్ట్రేలియాలో భారత రాయబారి మన్‌ప్రీత్‌ ఓహ్రా మాట్లాడుతూ సుస్థిర అభివృద్ధిలో జలవనరుల సంరక్షణ అనేది కీలకమన్నారు. వెస్టర్న్‌ సిడ్నీ విశ్వవిద్యాలయం ఆచార్యుడు వసంత్‌ మహేశ్వరి, భారత్‌లో ఆస్ట్రేలియా రాయబారి బ్యారీ ఓ ఫారెల్‌ పాల్గొన్నారు.

Read latest State News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని