ధాన్యం దించివెళ్లాక.. కోత పెడతారా!

దిగులుగా కూర్చున్న ఈ రైతులది కరీంనగర్‌ జిల్లా గంగాధర మండలం కొండాయపల్లి గ్రామం. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కొనుగోలు కేంద్రంలో ఈనెల 11న నలుగురు రైతులు 779 బస్తా (ఒక్కోటి 41.200 కిలోలు)లను కరీంనగర్‌ సమీపంలోని ముగ్దుంపూర్‌ మిల్లుకు పంపించారు.

Published : 30 Nov 2021 05:10 IST

కలెక్టర్‌ను కలిసేందుకు వచ్చి నిరీక్షిస్తున్న రైతులు

దిగులుగా కూర్చున్న ఈ రైతులది కరీంనగర్‌ జిల్లా గంగాధర మండలం కొండాయపల్లి గ్రామం. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కొనుగోలు కేంద్రంలో ఈనెల 11న నలుగురు రైతులు 779 బస్తా (ఒక్కోటి 41.200 కిలోలు)లను కరీంనగర్‌ సమీపంలోని ముగ్దుంపూర్‌ మిల్లుకు పంపించారు. మర్నాడు మిల్లరు ధాన్యం దింపుకొన్నారు. వడ్లలో తేమ ఎక్కువగా ఉందని చెప్పి... బస్తా తూకం వేస్తే 35 కిలోలే వస్తోందని, ఈ తరుగును మీరే  భరించాలని 28న రైతులకు సమాచారం ఇచ్చారు. వారంతా ఆందోళనతో సోమవారం కలెక్టరేట్‌కు వెళ్లారు. కలెక్టర్‌ లేకపోవడంతో సాయంత్రం వరకు నిరీక్షించి వెనక్కి వచ్చారు. ఈ విషయం ప్యాక్స్‌ కార్యదర్శి రమేశ్‌ దృష్టికి తీసుకెళ్లగా కేంద్రం నుంచి ధాన్యం సవ్యంగానే పంపించామని, మిల్లులో తేడా జరిగి ఉంటుందని పేర్కొన్నారు. పౌరసరఫరాల శాఖ డీఎం శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ మంగళవారం లారీ అసోసియేషన్‌ సభ్యులు, మిల్లరుతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తామని చెప్పారు.

-న్యూస్‌టుడే, గంగాధర

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని