మా బడిలో చేరని టీచర్లకు జీతాలు ఆపండి

‘మా పాఠశాలకు కేటాయించిన టీచర్లను మాకు పంపండి.. లేదంటే వారికి జీతాలు ఆపండి..’ అంటూ విద్యార్థులు నల్గొండ జిల్లా కేంద్రంలో కలెక్టరేట్‌, డీఈవో కార్యాలయం ఎదుట ప్లకార్డులతో నిరసన తెలిపారు. ‘డీఈవో జారీ చేసిన ఆర్డర్‌కే విలువ లేకుంటే ఎలా’ అని ప్రశ్నించారు.

Published : 30 Nov 2021 05:31 IST

‘మా పాఠశాలకు కేటాయించిన టీచర్లను మాకు పంపండి.. లేదంటే వారికి జీతాలు ఆపండి..’ అంటూ విద్యార్థులు నల్గొండ జిల్లా కేంద్రంలో కలెక్టరేట్‌, డీఈవో కార్యాలయం ఎదుట ప్లకార్డులతో నిరసన తెలిపారు. ‘డీఈవో జారీ చేసిన ఆర్డర్‌కే విలువ లేకుంటే ఎలా’ అని ప్రశ్నించారు. చండూరు మండలం బోడంగిపర్తిలోని ఎంజీఎం జడ్పీ ఉన్నత పాఠశాలకు డీఈవో గత నెల 27న నలుగురు ఉపాధ్యాయులను తాత్కాలిక సర్దుబాటు కింద నియమించారు. బోడంగిపర్తి దూరంగా ఉందన్న ఉద్దేశంతో ఆ ఉపాధ్యాయులు విధుల్లో చేరకుండా ఇతర పాఠశాలలకు హాజరవుతున్నారు. విషయం తెలుసుకున్న ఆ పాఠశాల విద్యార్థులు సోమవారం 35 కి.మీ.ల దూరంలోని నల్గొండకు చేరుకుని ఉపాధ్యాయుల తీరుపై నిరసన తెలుపుతూ నినాదాలు చేశారు. సమస్య పరిష్కరిస్తానని డీఈవో భిక్షపతి హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.

-న్యూస్‌టుడే, నల్గొండ విద్యావిభాగం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు