Published : 30/11/2021 05:31 IST

6 వరకు లొంగిపోవాల్సిన అవసరం లేదు

వరవరరావుకు బాంబే హైకోర్టు ఊరట

ముంబయి: మావోయిస్టులతో సంబంధం ఉందన్న కేసులో అరెస్టయి ప్రస్తుతం మెడికల్‌ బెయిల్‌పై ఉన్న కవి వరవరరావు(83)కు బాంబే హైకోర్టు సోమవారం కాస్త ఊరట కలిగించింది. డిసెంబరు ఆరో తేదీ వరకు తలోజా జైలు అధికారుల ముందు లొంగిపోవాల్సిన అవసరం లేదని ఆదేశాలు ఇచ్చింది. తొలుత డిసెంబరు రెండో తేదీ వరకు లొంగిపోవాల్సిన అవసరం లేదని ఉత్తర్వులు ఇవ్వగా, ఆ గడువును మరో నాలుగు రోజుల పాటు పొడిగిస్తూ జస్టిస్‌ నితిన్‌ జమదార్‌, జస్టిస్‌ ఎస్‌.వి.కొత్వాల్‌ల ధర్మాసనం ఆదేశాలు ఇచ్చింది. గతంలో ఇచ్చిన ఆదేశాల మేరకు ఆయనను ప్రయివేటు వైద్యశాల అయిన నానావతి ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించడంలో జాతీయ పరిశోధన సంస్థ విఫలం కావడంతో ఈ నిర్ణయం తీసుకొంది. తదుపరి విచారణను మూడో తేదీకి వాయిదా వేసింది.

Read latest State News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని