నేడు ఆర్టీసీ రక్తదాన శిబిరాలు

రాష్ట్రవ్యాప్తంగా టీఎస్‌ఆర్టీసీ బస్‌ డిపోల్లో మంగళవారం రక్తదాన శిబిరాలు నిర్వహించనున్నారు. జేబీఎస్‌లో ఆర్టీసీ ఛైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌, ఎంజీబీఎస్‌లో ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ శిబిరాలను ప్రారంభించనున్నారని సంస్థ ఒక ప్రకటనలో పేర్కొంది.

Published : 30 Nov 2021 05:31 IST

దాతలకు ఉచితంగా తిరుగు ప్రయాణ సౌకర్యం

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా టీఎస్‌ఆర్టీసీ బస్‌ డిపోల్లో మంగళవారం రక్తదాన శిబిరాలు నిర్వహించనున్నారు. జేబీఎస్‌లో ఆర్టీసీ ఛైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌, ఎంజీబీఎస్‌లో ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ శిబిరాలను ప్రారంభించనున్నారని సంస్థ ఒక ప్రకటనలో పేర్కొంది. ఆయా డిపోల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 వరకు జరగనున్న ఈ కార్యక్రమానికి సంస్థ ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసింది. రక్తదాతలకు ఆర్టీసీ బస్సుల్లో మంగళవారం ఉచితంగా తిరుగు ప్రయాణ సౌకర్యం కల్పించనున్నట్లు ప్రకటించింది. రెడ్‌క్రాస్‌ సొసైటీ నేతృత్వంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో తలసీమియా బాధితులకు రక్తం కొరత లేకుండా చూడడానికి ఈ శిబిరం ఏర్పాటు చేశామని యాజమాన్యం వివరించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని