Published : 30/11/2021 05:31 IST

బంగాళాఖాతంలో నేడు అల్పపీడనం

ఈనాడు, హైదరాబాద్‌: బంగాళాఖాతంలో అండమాన్‌ దీవులకు దక్షిణ ప్రాంతంలో మంగళవారం అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని వాతావరణశాఖ తెలిపింది. ఇది బుధవారం మరింత బలపడి వాయుగుండంగా మారే సూచనలున్నట్లు పేర్కొంది. రాష్ట్రంలో మంగళ, బుధవారాల్లో పొడి వాతావరణం ఉంటుంది. సోమవారం పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా 3 నుంచి 4 డిగ్రీల వరకూ తగ్గాయి. నిజామాబాద్‌లో గరిష్ఠంగా 27 డిగ్రీలు నమోదైంది. ఇది సాధారణం కన్నా 3.6 డిగ్రీలు తక్కువ. ఆదిలాబాద్‌ జిల్లా అర్లిలో సోమవారం తెల్లవారుజామున అత్యల్పంగా 13.4 డిగ్రీలు నమోదైంది.

Read latest State News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని