జీవో నంబరు 6పై విచారణనుత్వరగా ముగించండి

మత్స్యకార సంఘాల్లో సభ్యుల సంఖ్య పెంపునకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం జారీచేసిన జీవో నంబరు 6పై విచారణను త్వరగా ముగించాలని సర్వోన్నత న్యాయస్థానం తెలంగాణ హైకోర్టుకు సూచించింది. రాష్ట్రంలో ప్రాజెక్టుల నిర్మాణం,

Published : 01 Dec 2021 04:23 IST

తెలంగాణ హైకోర్టుకు..సుప్రీంకోర్టు సూచన

ఈనాడు, దిల్లీ: మత్స్యకార సంఘాల్లో సభ్యుల సంఖ్య పెంపునకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం జారీచేసిన జీవో నంబరు 6పై విచారణను త్వరగా ముగించాలని సర్వోన్నత న్యాయస్థానం తెలంగాణ హైకోర్టుకు సూచించింది. రాష్ట్రంలో ప్రాజెక్టుల నిర్మాణం, మిషన్‌ కాకతీయ పనులతో చెరువులు, కుంటల్లో పుష్కలంగా నీరు చేరుతుండడంతో మత్స్యకార సంఘాల్లో సభ్యుల సంఖ్యను పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం 2016 మార్చిలో ఈ జీవోను జారీచేసింది. ఆ జీవోతో గతంలో సొసైటీల్లో ఉన్న సభ్యుల సంఖ్య దాదాపు రెట్టింపయిందని, తమ ఉపాధి అవకాశాలు దెబ్బతిన్నాయంటూ గంగపుత్ర సంఘం హైకోర్టును ఆశ్రయించగా, సింగిల్‌ జడ్జి బెంచ్‌ రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పునిచ్చింది. గంగపుత్ర సంఘం దానిని సవాల్‌ చేయగా, డివిజన్‌ బెంచ్‌ సెప్టెంబరు 16న స్టే ఇచ్చింది. స్టేను సవాల్‌ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.  ఆయా పిటిషన్లపై జస్టిస్‌ వినీత్‌ శరణ్‌, జస్టిస్‌ అనిరుద్ధా బోస్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టి త్వరగా ముగించాలని పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని