Updated : 01/12/2021 05:49 IST

పొగాకు ఉత్పత్తులపై నిషేధం సబబే

128 దాకా పిటిషన్‌లు కొట్టేసిన హైకోర్టు

ఈనాడు, హైదరాబాద్‌: గుట్కా, ఖైనీ, పాన్‌ మసాలాలతో పాటు పొగాకు ఉత్పత్తులను నిషేధిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను సమర్థిస్తూ హైకోర్టు మంగళవారం తీర్పు వెలువరించింది. ప్రజల ప్రాణరక్షణకు కట్టుబడి ఉన్న నోటిఫికేషన్‌ను తప్పుబట్టలేమంది. కొవిడ్‌ కంటే గుట్కా వంటి ఉత్పత్తుల వినియోగం వల్ల క్యాన్సర్‌ బారినపడి ఎక్కువ మంది చనిపోతున్నారంది. విస్తృత ప్రజాప్రయోజనాల నిమిత్తం సహేతుక నియంత్రణ సబబేనని, ఇది రాజ్యాంగం కల్పించిన వాణిజ్య హక్కులకు అడ్డంకి కాదని స్పష్టం చేసింది. సిగరెట్‌, గుట్కా తదితర పొగాకు ఉత్పత్తులను నిషేధిస్తూ రాష్ట్ర ఆహార భద్రతా కమిషనర్‌ జనవరి 6న ఇచ్చిన నోటిఫికేషన్‌ను సవాలు చేస్తూ దాఖలైన సుమారు 128 పిటిషన్‌లపై సుదీర్ఘ వాదనలు విన్న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సతీష్‌ చంద్రశర్మ, జస్టిస్‌ ఎ.రాజశేఖర్‌రెడ్డిల ధర్మాసనం మంగళవారం  తీర్పును వెలువరించింది.

Read latest State News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని