పాకాలలో పెద్దపులి...

వరంగల్‌ జిల్లా పాకాల అభయారణ్యంలో పెద్ద పులి జాడ కనిపించింది. సోమవారం రాత్రి ఓ లారీ డ్రైవర్‌ తీసిన పెద్దపులి ఫొటోను అటవీశాఖ ధ్రువీకరించింది.

Published : 01 Dec 2021 04:27 IST

రంగల్‌ జిల్లా పాకాల అభయారణ్యంలో పెద్ద పులి జాడ కనిపించింది. సోమవారం రాత్రి ఓ లారీ డ్రైవర్‌ తీసిన పెద్దపులి ఫొటోను అటవీశాఖ ధ్రువీకరించింది. మంగళవారం అటవీ అధికారులు పులి సంచరించిన నీటి ప్రాంతం, పొలాలను పరిశీలించి పాదముద్రలు సేకరించారు. పాకాల అభయారణ్యం, సమీప పొలాల్లో పులి కదలికలు ఉన్నాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డీఎఫ్‌వో సూచించారు. దాదాపు 45-50 ఏళ్ల కిందట పాకాలలో పులులు సంచరించేవని.. ప్రస్తుతం తిరిగి రావడం పర్యావరణపరంగా శుభ పరిణామమని అన్నారు. 

-న్యూస్‌టుడే,ఖానాపురం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని