స్వామినాథన్‌ అవార్డుకు ప్రవీణ్‌రావు ఎంపిక

ప్రతిష్ఠాత్మక ఎం.ఎస్‌.స్వామినాథన్‌ జాతీయ అవార్డుకు ఆచార్య జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి(వీసీ) వి.ప్రవీణ్‌రావు ఎంపికయ్యారు. ‘భారత వ్యవసాయ

Published : 01 Dec 2021 04:34 IST

ఈనాడు, హైదరాబాద్‌: ప్రతిష్ఠాత్మక ఎం.ఎస్‌.స్వామినాథన్‌ జాతీయ అవార్డుకు ఆచార్య జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి(వీసీ) వి.ప్రవీణ్‌రావు ఎంపికయ్యారు. ‘భారత వ్యవసాయ పరిశోధనామండలి’(ఐసీఏఆర్‌) విశ్రాంత ఉద్యోగుల సంఘం, నూజివీడు సీడ్స్‌ కంపెనీ సంయుక్తంగా రెండేళ్లకోసారి ఈ అవార్డును ప్రకటిస్తున్నాయి. ఐసీఏఆర్‌ విశ్రాంత డైరెక్టర్‌ జనరల్‌ ఆర్‌.ఎస్‌.పరోడా అధ్యక్షతన 13 మంది జాతీయస్థాయి శాస్త్రవేత్తల కమిటీ ప్రవీణ్‌రావును ఎంపిక చేసింది. వ్యవసాయ పరిశోధన, విస్తరణ, బోధన, పరిపాలన అంశాల్లో ఆయన చేసిన విశేష కృషిని గుర్తించి ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్లు ప్రకటించింది. డిసెంబరు 8న హైదరాబాద్‌లో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతులమీదుగా ఈ అవార్డును అందజేస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని