వరి వద్దంటే ఎలా సారూ!

యాసంగిలో వరి పంట సాగు చేయవద్దనే అంశంపై అవగాహన కల్పించేందుకు వచ్చిన అధికారికి జిన్నారం మండలం ఊట్ల రైతులు ముచ్చెమటలు పట్టించారు. వ్యవసాయ విస్తరణ అధికారి యోగేశ్వర్‌రెడ్డి మంగళవారం గ్రామ

Published : 01 Dec 2021 04:37 IST

అవగాహన సమావేశానికి వచ్చిన అధికారిపై రైతుల ఆగ్రహం

నిరసన తెలుపుతున్న రైతులు

జిన్నారం, న్యూస్‌టుడే: యాసంగిలో వరి పంట సాగు చేయవద్దనే అంశంపై అవగాహన కల్పించేందుకు వచ్చిన అధికారికి జిన్నారం మండలం ఊట్ల రైతులు ముచ్చెమటలు పట్టించారు. వ్యవసాయ విస్తరణ అధికారి యోగేశ్వర్‌రెడ్డి మంగళవారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో అవగాహన సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆరంభంలోనే యాసంగిలో వరి పంట వేయకూడదని సూచించారు. దీంతో ఆగ్రహించిన అన్నదాతలు అధికారి ప్రసంగాన్ని అడ్డుకొని బయటకు తీసుకొచ్చారు. ఈ ప్రాంతంలో వరి తప్ప ఏ ఇతర పంటలు వేసినా కోతుల బెడద వల్ల దక్కటం లేదన్నారు.వరి మాత్రమే వేయగలమని స్పష్టం చేశారు. వర్షాలు పుష్కలంగా కురిసి చెరువులు నిండుకుండల్లా ఉన్నాయని, ఇటువంటి పరిస్థితిలో ఇతర పంటలు ఎలా వేస్తారని ప్రశ్నించారు. తమ ఆవేదనను ఉన్నతాధికారులకు నివేదించాలని కోరారు. దీంతో సమావేశం పూర్తిగా నిర్వహించకుండానే ఆ అధికారి వెళ్లిపోయారు. ప్రభుత్వాలు తమ జీవితాలతో ఆడుకుంటున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.వర్షాలు సమృద్ధిగా ఉన్నా లేకున్నా తమకే నష్టం జరుగుతోందన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని