నడవలేని వారికి నయా రెక్కలు

ఆదిలాబాద్‌ పట్టణం పాత హౌసింగ్‌బోర్డు కాలనీకి చెందిన చంద్రకాంత్‌ ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తుండేవారు. 2018 జూన్‌లో ఒక్కసారిగా తీవ్రమైన వెన్నునొప్పి వచ్చింది. రెండు కాళ్లూ చచ్చుబడిపోయాయి. ఆరునెలల వైద్యం అనంతరం...

Published : 02 Dec 2021 04:52 IST

రహదారిపై ద్విచక్ర వాహనంలా దూసుకెళుతూ..

దిలాబాద్‌ పట్టణం పాత హౌసింగ్‌బోర్డు కాలనీకి చెందిన చంద్రకాంత్‌ ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తుండేవారు. 2018 జూన్‌లో ఒక్కసారిగా తీవ్రమైన వెన్నునొప్పి వచ్చింది. రెండు కాళ్లూ చచ్చుబడిపోయాయి. ఆరునెలల వైద్యం అనంతరం... ఇలాగే జీవించక తప్పదని డాక్టర్లు చెప్పారు. ఆ సమయంలో భార్య శాంత ధైర్యం చెప్పి.. సపర్యలు చేస్తూ అండగా నిలిచింది. తీవ్రమైన ఆవేదన. బయటి ప్రపంచాన్ని చూసే అవకాశం లేకుండా పోయింది. బయటకు వెళ్లాలంటే ఇద్దరి సహాయంతో ఆటో ఎక్కాల్సి వచ్చేది.  దీనికి పరిష్కారమేంటని ఆయన అంతర్జాలంలో వెతికారు. అలా ఐఐటీ మద్రాస్‌ వారు రూపొందించిన న్యూబోల్డ్‌ వీల్‌ఛైర్‌ గురించి తెలిసింది. ఎలా పని చేస్తుందో వీడియోలు చూసిన తరువాత రూ.95,000 ఖర్చుచేసి కొనుగోలు చేశారు. ‘మొదటి సారిగా ఈ బండి నడిపేటప్పుడు నా కళ్ల వెంట నీరొచ్చేసింది. బాహ్య ప్రపంచాన్ని చూడడానికి రెక్కలు వచ్చినట్టే అనిపించింది. ఇంట్లో వీల్‌ఛైర్‌లా.. బయట ద్విచక్ర వాహనంలా ఉపయోగపడుతోంది. నాలుగు గంటలు ఛార్జింగ్‌ పెడితే సుమారు 30 కిలోమీటర్లు దూరం ప్రయాణించవచ్చు.  ఎవరి సాయం లేకుండా వీల్‌ఛైర్‌కు అనుసంధానం చేసుకోచ్చు. తొలగించుకోవచ్చు. ప్రస్తుతం ఇంటికి సంబంధించిన చిన్న పనులన్నీ సొంతంగా చేసుకుంటున్నాను.’ అంటున్నారు చంద్రకాంత్‌. 

    - ఈనాడు, ఆదిలాబాద్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని