రెండు పడకగదుల ఇళ్లలోకి ప్రవేశించిన మహిళలు

తమకు రెండు పడకగదుల ఇళ్లు కేటాయించాలని డిమాండ్‌ చేస్తూ వాటిలోకి పలువురు మహిళలు ప్రవేశించగా.. వారిని పోలీసులు బలవంతంగా బయటకు పంపించిన ఘటన మహబూబాబాద్‌ జిల్లా కురవి లో బుధవారం చోటుచేసుకుంది.

Published : 02 Dec 2021 04:52 IST

బలవంతంగా బయటకు పంపిన అధికారులు

మహిళను బలవంతంగా తీసుకెళుతున్న కానిస్టేబుళ్లు

కురవి, న్యూస్‌టుడే: తమకు రెండు పడకగదుల ఇళ్లు కేటాయించాలని డిమాండ్‌ చేస్తూ వాటిలోకి పలువురు మహిళలు ప్రవేశించగా.. వారిని పోలీసులు బలవంతంగా బయటకు పంపించిన ఘటన మహబూబాబాద్‌ జిల్లా కురవి లో బుధవారం చోటుచేసుకుంది. కురవిలో ప్రభుత్వం ఏడాది క్రితం రెండు పడకగదుల ఇళ్లు 30 నిర్మించింది. వాటిని లబ్ధిదారులకు కేటాయించలేదు. బుధవారంపలువురు మహిళలు ఆ గృహాల్లోకి ప్రవేశించారు. ఇన్‌ఛార్జి తహసీల్దార్‌ తరంగిణి అక్కడికి చేరుకుని లబ్ధిదారులను ఎంపిక చేసి, అర్హులకు కేటాయిస్తామని నచ్చజెప్పారు. మహిళలు ససేమిరా అన్నారు. దీంతో జిల్లా అధికారుల ఆదేశాల మేరకు మహబూబాబాద్‌ రూరల్‌ సీఐ రవికుమార్‌ ఆధ్వర్యంలో స్పెషల్‌ పార్టీ పోలీసులు వారిని బలవంతంగా గృహాల్లోంచి బయటకు పంపించారు. కొంతమంది బయటకు రావడానికి నిరాకరించడంతో పోలీసులే స్వయంగా సామగ్రిని బయటకు తరలించారు. ఇళ్లకు రెవెన్యూ అధికారులు తాళాలు వేశారు. గృహాల ముందు మహిళలు బైఠాయించగా.. వారిని మహిళా పోలీసులు మినీ బస్సులో ఎక్కిస్తుండగా కొంత ఉద్రిక్తత ఏర్పడింది. సమస్యను ఎమ్మెల్యే రెడ్యానాయక్‌, కలెక్టర్‌ శశాంక దృష్టికి తీసుకెళ్లినప్పటికీ పట్టించుకోవడం లేదని మహిళలు ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు. వారిని కురవి ఠాణాకు తరలించి, కౌన్సెలింగ్‌ చేసి పంపించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని