విద్యుత్‌ వాహనాల ఛార్జింగ్‌ గరిష్ఠ ధర రూ.12.06

విద్యుత్‌ వాహనాల ఛార్జింగ్‌ చేసినందుకు ఒక యూనిట్‌ కరెంటుకు గరిష్ఠంగా రూ.12.06, అదనంగా నిబంధనల ప్రకారం జీఎస్టీ కలిపి తీసుకోవచ్చని ఇంధన శాఖ శుక్రవారం ఉత్తర్వులిచ్చింది. అంతకుమించి వసూలు చేయరాదని

Published : 04 Dec 2021 05:07 IST

ఒక యూనిట్‌కు అంతకుమించి వసూలు చేయరాదు

ఈనాడు, హైదరాబాద్‌: విద్యుత్‌ వాహనాల ఛార్జింగ్‌ చేసినందుకు ఒక యూనిట్‌ కరెంటుకు గరిష్ఠంగా రూ.12.06, అదనంగా నిబంధనల ప్రకారం జీఎస్టీ కలిపి తీసుకోవచ్చని ఇంధన శాఖ శుక్రవారం ఉత్తర్వులిచ్చింది. అంతకుమించి వసూలు చేయరాదని పేర్కొంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రాయితీలు తీసుకుని వాహనాల ఛార్జింగ్‌ స్టేషన్లు ఏర్పాటుచేసేవారు ఈ నిబంధనను తప్పకుండా పాటించాలని ఆదేశించింది. రాష్ట్ర పునరుద్ధరణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ (టీఎస్‌ రెడ్కో) రాష్ట్ర నోడల్‌ ఏజెన్సీగా పనిచేస్తోంది. ఛార్జీల వసూలు విషయమై భారత అడ్మినిస్ట్రేటివ్‌ స్టాఫ్‌ కాలేజ్‌తో అధ్యయనం చేయించారు. దీని ప్రకారం జీఎస్టీ కాకుండా గరిష్ఠ ఛార్జీ రూ.12.06కు మించి వసూలు చేయరాదని ఇంధన శాఖ తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని