‘ఎక్కువ నమూనాల జన్యుక్రమ ఆవిష్కరణపై దృష్టి’

దేశంలో ఒమిక్రాన్‌ రకం కేసులు బయటపడటంతో సాధ్యమైనంత ఎక్కువ వైరస్‌ నమూనాల జన్యుక్రమాలను కనుగొనడంపై దృష్టి పెట్టినట్లు సీసీఎంబీ సలహాదారు డాక్టర్‌ రాకేశ్‌ మిశ్ర తెలిపారు. ఒమిక్రాన్‌ రెండు కేసులను గుర్తించిన

Published : 04 Dec 2021 05:10 IST

సీసీఎంబీ సలహాదారు డాక్టర్‌ రాకేశ్‌మిశ్ర

ఈనాడు, హైదరాబాద్‌: దేశంలో ఒమిక్రాన్‌ రకం కేసులు బయటపడటంతో సాధ్యమైనంత ఎక్కువ వైరస్‌ నమూనాల జన్యుక్రమాలను కనుగొనడంపై దృష్టి పెట్టినట్లు సీసీఎంబీ సలహాదారు డాక్టర్‌ రాకేశ్‌ మిశ్ర తెలిపారు. ఒమిక్రాన్‌ రెండు కేసులను గుర్తించిన బెంగళూరుతో పాటు హైదరాబాద్‌, దిల్లీ, పుణె నగరాల్లో పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. మహమ్మారి వ్యాప్తిని నిరోధించేందుకు ఈ నాలుగు నగరాల్లో వైరస్‌ జీనోమ్‌ సీక్వెన్సింగ్‌తో నిఘా పెట్టేందుకు నాలుగు నెలల క్రితం పలు జాతీయ సంస్థలు ఒక కన్సార్షియంగా ఏర్పాటై అధ్యయనం చేస్తున్నాయన్నారు. ఇందులో ఒకటైన బెంగళూరులోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బయాలాజికల్‌ సైన్సెస్‌(ఎన్‌సీబీఎస్‌) సంస్థ ఒమిక్రాన్‌ కేసులను గుర్తించిందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని