వరవరరావుకు వైద్య పరీక్షలు చేయించండి

మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయన్న కేసులో అరెస్టయిన విప్లవకవి వరవరరావు (83)కు నానావతి ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించాలని బాంబే హైకోర్టు శుక్రవారం జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ)ను ఆదేశించింది. ఆయనకు ఇచ్చిన

Published : 04 Dec 2021 05:13 IST

18 వరకు లొంగిపోవాల్సిన అవసరం లేదు
ఎన్‌ఐఏకు బాంబే హైకోర్టు ఆదేశం

ముంబయి: మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయన్న కేసులో అరెస్టయిన విప్లవకవి వరవరరావు (83)కు నానావతి ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించాలని బాంబే హైకోర్టు శుక్రవారం జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ)ను ఆదేశించింది. ఆయనకు ఇచ్చిన మెడికల్‌ బెయిల్‌ను పొడిగించాలా? వద్దా? అనే విషయాన్ని దీని ఆధారంగానే నిర్ణయిస్తామని తెలిపింది. అందువల్ల ఆయన ఈ నెల 18 వరకు తలోజా జైలు అధికారుల ముందు లొంగిపోవాల్సిన అవసరం లేదని జస్టిస్‌ నితిన్‌ జామ్‌దర్‌, జస్టిస్‌ ఎస్‌.వి.కొత్వాల్‌లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. ఎన్‌ఐఏ తరఫు న్యాయవాది సందేశ్‌ పాటిల్‌ వాదనలు వినిపిస్తూ ఆయనకు నవంబరు 18నే వైద్య పరీక్షలు చేయించాలని కోర్టు ఆదేశించినా, వివిధ విభాగాల వైద్యులు అందుబాటులో లేకపోవడంతో సాధ్యం కాలేదని తెలిపారు. కోర్టు ఉత్తర్వులను అవకాశంగా తీసుకొని మొత్తం శరీరానికి పరీక్షలు చేయించాలని వరవరరావు కోరుకుంటున్నారని చెప్పారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ ‘‘ఆయన అనారోగ్యంగా ఉన్నారా? ఆ కారణంగా మెడికల్‌ బెయిల్‌ను కొనసాగించవచ్చా? అన్నదే ప్రస్తుత ప్రశ్న. పరీక్షల్లో మరేదైనా వ్యాధి బయటపడితే అప్పుడేం చేస్తారు? వృద్ధ్యాప్యం దృష్ట్యా వాస్తవ రీతిలో ఆలోచించాలి’’ అని తెలిపింది. ఆసుపత్రి ప్రతినిధి మాట్లాడుతూ పరీక్షలు జరపడానికి యూరాలజిస్ట్‌, సైక్రాయిస్టుల అవసరం ఉందని చెప్పారు. ఈ నెల 16న నివేదికలు సమర్పించాలని, 17న బెయిల్‌ పిటిషన్‌ను పరిశీలిస్తామని ధర్మాసనం తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని