అంచనాకు మించే ‘సంగమేశ్వర’ టెండర్‌ దక్కించుకున్న మేఘా సంస్థ

సంగారెడ్డి జిల్లాలో నిర్మించనున్న సంగమేశ్వర ఎత్తిపోతల పథకం పనులను అంచనా ధర కన్నా 4.65 శాతం ఎక్కువకు మేఘా ఇంజినీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌ దక్కించుకుంది.

Published : 04 Dec 2021 05:15 IST

ఈనాడు, హైదరాబాద్‌: సంగారెడ్డి జిల్లాలో నిర్మించనున్న సంగమేశ్వర ఎత్తిపోతల పథకం పనులను అంచనా ధర కన్నా 4.65 శాతం ఎక్కువకు మేఘా ఇంజినీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌ దక్కించుకుంది. రూ.2,249 కోట్ల అంచనాతో చేపడుతున్న పనుల టెండర్‌ను శుక్రవారం నీటి పారుదలశాఖ ఇంజినీర్లు తెరిచారు. ఈ పనులు చేపట్టడానికి రూ.2,353 కోట్లకు కోట్‌ చేసిన మేఘా ఎల్‌-1గా నిలవగా, అంచనా ధర కన్నా 4.90 శాతం ఎక్కువగా రూ.2,359 కోట్లకు కోట్‌ చేసిన నవయుగ సంస్థ ఎల్‌-2గా నిలిచింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు