‘అన్నదాతలకూ పింఛన్లు ఇవ్వాలి’

ప్రభుత్వ ఉద్యోగులకు పదవీ విరమణ అనంతరం ఇస్తున్నట్లుగా ప్రతి రైతుకు, కుటుంబ సభ్యులకు పింఛన్లు ఇవ్వాలని తెలంగాణ రైతు రక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు పాకాల శ్రీహరిరావు డిమాండ్‌ చేశారు. పిల్లల చదువులు

Published : 05 Dec 2021 05:23 IST

ఈనాడు, హైదరాబాద్‌: ప్రభుత్వ ఉద్యోగులకు పదవీ విరమణ అనంతరం ఇస్తున్నట్లుగా ప్రతి రైతుకు, కుటుంబ సభ్యులకు పింఛన్లు ఇవ్వాలని తెలంగాణ రైతు రక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు పాకాల శ్రీహరిరావు డిమాండ్‌ చేశారు. పిల్లల చదువులు, వివాహాలు, గృహ నిర్మాణాలు, వైద్య ఖర్చుల నిమిత్తం బ్యాంకుల నుంచి సులభంగా రుణాలూ ఇప్పించాలని శనివారం ఆయన ఒక ప్రకటనలో కోరారు. రైతుల ఖర్చుల్లో సగం ఉపాధి హామీ పథకం కింద భరించేలా చూడాలని కోరారు. పంటల బీమా పథకానికి కేంద్ర ప్రభుత్వమే మొత్తం ప్రీమియం చెల్లించాలన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని