ఉపాధి కూలీలకు అసంఘటిత గుర్తింపు దక్కేనా?

రాష్ట్రంలో ఉపాధి హామీ కూలీలను అసంఘటిత కార్మికులుగా గుర్తించే ప్రక్రియ ఆలస్యమవుతోంది. వారి వివరాలను ఈ-శ్రమ్‌ పోర్టల్‌లో నమోదు చేయాలని కేంద్రం ఆదేశించినా క్షేత్రస్థాయిలో ఆ ప్రక్రియ ప్రారంభం కాలేదు.

Published : 05 Dec 2021 05:23 IST

రాష్ట్రంలో మొదలుకాని ఈ-శ్రమ్‌ పోర్టల్‌ రిజిస్ట్రేషన్లు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఉపాధి హామీ కూలీలను అసంఘటిత కార్మికులుగా గుర్తించే ప్రక్రియ ఆలస్యమవుతోంది. వారి వివరాలను ఈ-శ్రమ్‌ పోర్టల్‌లో నమోదు చేయాలని కేంద్రం ఆదేశించినా క్షేత్రస్థాయిలో ఆ ప్రక్రియ ప్రారంభం కాలేదు. అసంఘటిత కార్మికులకు సామాజిక భద్రత, ప్రమాద, ఆరోగ్య బీమా కల్పించేందుకు కేంద్ర కార్మికశాఖ నమోదు ప్రక్రియను ప్రారంభించింది. ఈ నెలాఖరులోగా వివరాలు నమోదైతేనే రూ.2 లక్షల ప్రమాదబీమాకు అర్హులవుతారని పంచాయతీరాజ్‌ శాఖ తెలిపింది. అంతేకాకుండా కార్మికుల కుటుంబాలకు రూ.5 లక్షల విలువైన వైద్యం కోసం ఆయుష్మాన్‌ భారత్‌ కార్డులు జారీ చేయనున్నట్లు పేర్కొంది.
రాష్ట్రంలో ప్రస్తుతం 1.19 కోట్ల మందికి ఉపాధి హామీ జాబ్‌కార్డులు ఉన్నాయి. గ్రామాల్లో కూలీల వివరాలు నమోదు చేసేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు అందుబాటులో లేవు. ప్రధాన పంచాయతీల్లో మాత్రమే కంప్యూటర్లు అందుబాటులో ఉన్నాయి. దీంతో ఈ-శ్రమ్‌ పోర్టల్‌లో నమోదు ప్రక్రియ ఇంకా మొదలు కాలేదు. ఈ నెలాఖరులోగా ప్రక్రియ పూర్తిచేసేందుకు అదనపు మౌలిక సదుపాయాలు కల్పించాలని పంచాయతీ కార్యదర్శులు కోరుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని