రొయ్య పిల్లల పంపిణీ పర్యవేక్షణకు కమిటీ: తలసాని

నీటి వనరుల్లో రొయ్య పిల్లల పంపిణీ పర్యవేక్షణకు కమిటీ ఏర్పాటు చేస్తామని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్యశాఖల మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వం ఉన్నత లక్ష్యంతో

Published : 07 Dec 2021 05:01 IST

ఈనాడు, హైదరాబాద్‌: నీటి వనరుల్లో రొయ్య పిల్లల పంపిణీ పర్యవేక్షణకు కమిటీ ఏర్పాటు చేస్తామని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్యశాఖల మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వం ఉన్నత లక్ష్యంతో చేపట్టిన ఈ కార్యక్రమంలో నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా మధ్య మానేరు, నల్గొండ జిల్లా కొండ భీమనపల్లి చెరువులో విడుదల చేసిన రొయ్య పిల్లల నాణ్యత, లెక్కల్లో నిబంధనలు పాటించలేదని వచ్చిన ఫిర్యాదులపై ఆయన స్పందించారు. విచారణ కోసం మత్స్యశాఖ అదనపు సంచాలకుడి ఆధ్వర్యంలో ఉన్నతాధికారులతో కమిటీని ఏర్పాటు చేయాలని ఆ శాఖ కమిషనర్‌ లచ్చిరాం భూక్యాను మంత్రి ఆదేశించారు. అవకతవకలు జరిగినట్లు నిర్ధారణ అయితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి స్పష్టం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు