‘సురేంద్రపురి’ వ్యవస్థాపకుడు కుందా సత్యనారాయణ కన్నుమూత

యాదాద్రి పుణ్యక్షేత్రానికి సమీపంలోని సురేంద్రపురి ఆలయం, కుందా సత్యనారాయణ కళాధామం వ్యవస్థాపకుడు కుందా సత్యనారాయణ(85) అస్వస్థతతో బుధవారం....

Published : 13 Jan 2022 05:19 IST

భువనగిరి గ్రామీణం, న్యూస్‌టుడే: యాదాద్రి పుణ్యక్షేత్రానికి సమీపంలోని సురేంద్రపురి ఆలయం, కుందా సత్యనారాయణ కళాధామం వ్యవస్థాపకుడు కుందా సత్యనారాయణ(85) అస్వస్థతతో బుధవారం హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని తన స్వగృహంలో కన్నుమూశారు. గత ఆరు నెలలుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఖమ్మం జిల్లా బస్వాపురం గ్రామానికి చెందిన కుందా సత్యనారాయణ మూడో కుమారుడు సురేంద్రబాబు 1991లో మరణించగా.. ఆయన జ్ఞాపకార్థం 1998లో యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం వడాయిగూడెం గ్రామపంచాయతీ పరిధిలో స్థలం కొని ఆ ప్రాంతానికి సురేంద్రపురి ప్రాంగణంగా నామకరణం చేశారు. కాశీ నుంచి కన్యాకుమారి వరకు గల ఆలయాలన్నింటినీ ఒకే ప్రదేశంలో చూసిన అనుభూతి కలగాలన్న ఉద్దేశంతో 2008లో వివిధ ప్రముఖ ఆలయాల పోలికతో దేవాలయాలు, దేవుళ్ల విగ్రహాలు కట్టించారు. రామాయణ, మహాభారత, భాగవత సన్నివేశాలను విగ్రహాల రూపంలో ఏర్పాటు చేయించారు. ఈ ప్రాంతానికి ‘కుందా సత్యనారాయణ కళాధామం’ పేరు పెట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని