సిరిసంపదలు, భోగభాగ్యాలతో తులతూగాలి

మకర సంక్రాంతి సందర్భంగా తెలంగాణ గవర్నర్‌ తమిళిసై, ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలు సిరిసంపదలు, భోగభాగ్యాలతో తులతూగాలని ఆకాంక్షించారు. పంటల పండుగ సంక్రాంతి అందరికీ సంతోషం, శ్రేయస్సు, ఆరోగ్యాన్ని తీసుకురావాలని ఆకాంక్షించారు

Published : 15 Jan 2022 05:34 IST

గవర్నర్‌, సీఎం సంక్రాంతి శుభాకాంక్షలు

ఈనాడు  హైదరాబాద్‌: మకర సంక్రాంతి సందర్భంగా తెలంగాణ గవర్నర్‌ తమిళిసై, ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలు సిరిసంపదలు, భోగభాగ్యాలతో తులతూగాలని ఆకాంక్షించారు. పంటల పండుగ సంక్రాంతి అందరికీ సంతోషం, శ్రేయస్సు, ఆరోగ్యాన్ని తీసుకురావాలని ఆకాంక్షించారు. ఒమిక్రాన్‌ నేపథ్యంలో అందరూ కరోనా నిబంధనలకు పాటిస్తూ పండుగను ఆనందోత్సాహాలతో నిర్వహించుకోవాలన్నారు. ప్రాచీన, మహిమాన్వితమైన సంప్రదాయానికి సంక్రాంతి వేడుకలు అద్దం పడతాయని గవర్నర్‌ తెలిపారు. అన్నివర్గాలను సంక్రాంతి వేడుకలు దగ్గర చేస్తాయన్నారు.


ప్రజల జీవితాల్లో నిత్య సంక్రాంతులు: కేసీఆర్‌

స్వరాష్ట్రంలో సాగునీటి రంగాన్ని అభివృద్ధి చేసుకున్నామని... పంట పెట్టుబడి సాయం, అనేక రైతు సంక్షేమ పథకాలు, పటిష్ఠ చర్యలతో వ్యవసాయ రంగంలో రాష్ట్ర ప్రభుత్వం నిత్య సంక్రాంతిని నెలకొల్పిందని సీఎం కేసీఆర్‌ అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా తెలంగాణలో వ్యవసాయం, అనుబంధ రంగాల్లో పండుగ వాతావరణం ఉందన్నారు. వ్యవసాయానికి రాష్ట్రప్రభుత్వం ఎప్పటిలాగే అండగా నిలుస్తుందన్నారు. ఎన్ని కష్టాలెదురైనా సమర్థంగా ఎదుర్కొంటామని, రైతుల జీవితాల్లో ఎల్లవేళలా సంతోషాలను నింపేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ప్రజలు, రైతులు పచ్చదనం నడుమ పండుగ చేసుకోవాలన్నారు. శాసనసభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు, శ్రీనివాస్‌గౌడ్‌, నిరంజన్‌రెడ్డి, ఎమ్మెల్సీ కవిత ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని