ప్రాంతీయ రింగురోడ్డుకు హద్దు రాళ్ల ఏర్పాటు

ప్రాంతీయ రింగురోడ్డు తూర్పు భాగం నిర్మాణ సన్నాహాల్లో భాగంగా సమగ్ర నివేదిక తయారీకి ప్రభుత్వం నియమించిన గుత్తేదారు సంస్థ (కేఅండ్‌జే) హద్దురాళ్లను ఏర్పాటు చేస్తోంది. శుక్రవారం సిద్దిపేట జిల్లా జగదేవపూర్‌ మండలంలో కొలతలు చేపట్టి.

Published : 15 Jan 2022 05:44 IST

జగదేవపూర్‌, నర్సాపూర్‌, న్యూస్‌టుడే: ప్రాంతీయ రింగురోడ్డు తూర్పు భాగం నిర్మాణ సన్నాహాల్లో భాగంగా సమగ్ర నివేదిక తయారీకి ప్రభుత్వం నియమించిన గుత్తేదారు సంస్థ (కేఅండ్‌జే) హద్దురాళ్లను ఏర్పాటు చేస్తోంది. శుక్రవారం సిద్దిపేట జిల్లా జగదేవపూర్‌ మండలంలో కొలతలు చేపట్టి.. పీర్లపల్లి గ్రామం సరిహద్దున జివ్వగుండు నుంచి ఇటిక్యాల, అలీరాజపేట గ్రామాల మీదుగా 5 కి.మీ.కు ఒక హద్దురాయిని పాతుతూ వెళ్లారు. మెదక్‌ జిల్లా నర్సాపూర్‌ మండలం ఎల్లారెడ్డిగూడ తండా - మూసాపేట గ్రామాల మధ్య రెండు చోట్ల హద్దు రాళ్లు ఏర్పాటు చేశారు. ఇందుకోసం డ్రోన్‌ కెమెరాలతో సర్వే నిర్వహిస్తున్నారు. రహదారి వెళ్తున్న మార్గాన్ని ప్రాథమికంగా గుర్తించామని, పూర్తిస్థాయిలో సర్వే చేపట్టి భూమి ఏమేరకు అవసరం, వాటి సర్వే నంబర్లు, యజమానిని గుర్తించే పనులు చేపడతామని గుత్తేదారు సంస్థ ప్రతినిధి వినోద్‌ ‘న్యూస్‌టుడే’కి తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని