బస్సుల తనిఖీకి పది బృందాలు: రవాణాశాఖ

పండగ సందర్భంగా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న ప్రయివేటు బస్సుల తనిఖీ కోసం పది బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్‌ ఎంఆర్‌ఎం రావు శుక్రవారం ఓప్రకటనలో పేర్కొన్నారు. ‘రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ సూచనల

Published : 15 Jan 2022 06:17 IST

ఈనాడు, హైదరాబాద్‌: పండగ సందర్భంగా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న ప్రయివేటు బస్సుల తనిఖీ కోసం పది బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్‌ ఎంఆర్‌ఎం రావు శుక్రవారం ఓప్రకటనలో పేర్కొన్నారు. ‘రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ సూచనల మేరకు తనిఖీ బృందాల సంఖ్యను పెంచాం. ఈ నెల 17 వరకు ప్రత్యేక బృందాలు తనిఖీలు నిర్వహిస్తాయి. ఇప్పటికే 20 బస్సులను జప్తు చేయటంతోపాటు 104 ప్రయివేటు బస్సులపై అపరాధ రుసుం విధించాం’ అని ఎంఆర్‌ఎం రావు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని