
వంకాయ..పొడవులో సొరకాయ..!
సాధారణ పొడవుకు భిన్నంగా సొరకాయ మాదిరిగా ఆదిలాబాద్ రైతు బజార్లో ఓ వంకాయ కనిపించింది. యాపల్గూడకు చెందిన రాందాస్ అనే రైతు నాటిన వంగ మొక్కకు కాసిన వంకాయలు అడుగున్నర వరకు పెరిగాయి. ఈ విషయాన్ని జిల్లా ఉద్యానశాఖాధికారి శ్రీనివాసరెడ్డి దృష్టికి తీసుకెళ్లగా.. కొందరు రైతులు పాతకాలం విత్తనాలను బూడిదలో దాచిపెట్టి కొద్దికొద్దిగా వాడుతుంటారని, వాటిని సారవంతమైన నేలలో సేంద్రియపద్ధతిలో పండిస్తే ఏపుగా పెరుగుతుంటాయని చెప్పారు. వంకాయలు ఇలా అడుగున్నర పొడవు పెరగడం అరుదని అన్నారు.
- ఈనాడు, ఆదిలాబాద్
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.