లక్ష్మీ బ్యారేజీలో మూడు గేట్ల ఎత్తివేత

ఎగువ ప్రాంతాల్లో  వర్షాలు పడుతుండటంతో కాళేశ్వరం ప్రాజెక్టులోని లక్ష్మీ (మేడిగడ్డ) బ్యారేజీకి 12,490 క్యూసెక్కుల ప్రవాహం వచ్చి చేరుతోంది. దీంతో ఇంజినీరింగ్‌ అధికారులు ఆదివారం మూడు గేట్లు ఎత్తి

Published : 17 Jan 2022 04:16 IST

మహదేవపూర్‌, న్యూస్‌టుడే: ఎగువ ప్రాంతాల్లో  వర్షాలు పడుతుండటంతో కాళేశ్వరం ప్రాజెక్టులోని లక్ష్మీ (మేడిగడ్డ) బ్యారేజీకి 12,490 క్యూసెక్కుల ప్రవాహం వచ్చి చేరుతోంది. దీంతో ఇంజినీరింగ్‌ అధికారులు ఆదివారం మూడు గేట్లు ఎత్తి 12,490 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. సరస్వతీ (అన్నారం) బ్యారేజీకి 1200 క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా రెండు గేట్ల ద్వారా 900 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం లక్ష్మీ బ్యారేజీలో 16.17 టీఎంసీలకుగాను 13.38 టీఎంసీలు, సరస్వతీ బ్యారేజీలో 10.87 టీఎంసీలకు గాను 8.8 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు ప్రవాహం పెరిగే అవకాశముండటంతో నీటిని దిగువకు వదులుతున్నట్లు ఇంజినీరింగ్‌ అధికారులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని