అమరావతి రైతుల ‘సమర సంక్రాంతి’

ఏపీ రాజధాని అమరావతి రైతుల సంక్రాంతి వేడుకల్లో మూడు రాజధానుల నిర్ణయంపై నిరసన జ్వాలలు హోరెత్తాయి. రంగవల్లిక నుంచి గాలిపటాల వరకు అమరావతి ఆకాంక్ష ప్రతిధ్వనించింది. పండుగైన శనివారం

Published : 17 Jan 2022 04:27 IST

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ఏపీ రాజధాని అమరావతి రైతుల సంక్రాంతి వేడుకల్లో మూడు రాజధానుల నిర్ణయంపై నిరసన జ్వాలలు హోరెత్తాయి. రంగవల్లిక నుంచి గాలిపటాల వరకు అమరావతి ఆకాంక్ష ప్రతిధ్వనించింది. పండుగైన శనివారం ‘సమర సంక్రాంతి’ పేరుతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. శిబిరం ముందు పొంగళ్లు పెట్టి వంటావార్పు నిర్వహించారు. ‘సేవ్‌ అమరావతి, సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌’ అని రాసివున్న ఆకుపచ్చ బెలూన్లు, గాలిపటాలను ఎగరవేసి నిరసన తెలిపారు. మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వెలగపూడిలో ఆదివారం రాత్రి రైతులు, మహిళలు, చిన్నారులు భారీ కాగడాల ప్రదర్శన నిర్వహించారు. ‘అమరావతి మెగా వెలుగు’ కార్యక్రమంలో భాగంగా వెలగపూడి శిబిరం నుంచి మల్కాపురం జంక్షన్‌ వరకు సుమారు కిలోమీటరు మేర రహదారికి ఇరువైపులా కాగడాలు, కొవ్వొత్తులు పట్టుకుని నిరసన తెలిపారు. వెంకటపాలెం, దొండపాడు, పెదపరిమి, నెక్కల్లు, కృష్ణాయపాలెం, నీరుకొండ, మోతడక తదితర గ్రామాల్లో ఆదివారం కూడా నిరసనలు కొనసాగాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని