
Published : 17 Jan 2022 04:27 IST
అశ్వంపై అఖండ!
సంక్రాంతి రోజున సినీనటుడు బాలకృష్ణ.. తన సోదరి, భాజపా నాయకురాలు దగ్గుబాటి పురందేశ్వరి నివాసంలో సందడిగా గడిపారు. ప్రకాశం జిల్లా కారంచేడులోని బావ దగ్గుబాటి వెంకటేశ్వరరావు, పురందేశ్వరి ఇంటి వద్దకు ప్రత్యేకంగా తీసుకొచ్చిన గుర్రం ఎక్కి కాసేపు తిరిగారు. బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ గుర్రం ఎక్కగా బాలకృష్ణ దంపతులు, దగ్గుబాటి కుటుంబీకులు ఉత్సాహపరిచారు. అనంతరం అలంకరించిన బండి ఎక్కి ప్రాంగణంలో బాలకృష్ణ సరదాగా తిరిగారు. చీరాల మండలం వాడరేవు సముద్రతీరం వద్ద కూడా జీపులో తన సతీమణి వసుంధరతో కలిసి కిలోమీటరు మేర తిరిగారు.
- న్యూస్‌టుడే, పర్చూరు, చీరాల గ్రామీణం
Advertisement
Tags :