
Published : 17 Jan 2022 04:27 IST
‘ఉమ్మడి నల్గొండ’లో నడిరేయి.. జడివాన
సూర్యాపేట పురపాలిక, న్యూస్‌టుడే: నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో శనివారం అర్ధరాత్రి దాటాక భారీవర్షం కురిసింది. వాగులు, వంకలు పొంగిపొర్లాయి. పలుచోట్ల చెరువుల అలుగులు పారాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కొన్నిచోట్ల ఇళ్లల్లోకి వాననీరు చేరటంతో రాత్రంతా జాగారం తప్పలేదు. సూర్యాపేట మండలం యర్కారం గ్రామంలో అత్యధికంగా 11.7 సెం.మీ. వర్షపాతం నమోదైంది. వర్షానికి సూర్యాపేట జిల్లాలో మిరప పంటకు నష్టం వాటిల్లింది.
Advertisement
Tags :