
Published : 18 Jan 2022 04:08 IST
యాదాద్రి విమాన గోపురానికి రూ.50 లక్షల విరాళం
ఆలయ ఈవో గీతారెడ్డికి డీడీ అందజేస్తున్న శ్రీనివాస్, కుటుంబసభ్యులు
యాదగిరిగుట్ట, కార్వాన్-న్యూస్టుడే: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ విమాన గోపురం బంగారు తాపడానికి హైదరాబాద్ కార్వాన్కు చెందిన బండారి విద్యాసంస్థల అధినేత, భాజపా నాయకుడు బండారి శ్రీనివాస్, ఆయన సోదరులు, కుటుంబసభ్యులు రూ.50 లక్షల విరాళం ప్రకటించారు. ఈ మేరకు సోమవారం యాదాద్రిలో శ్రీనివాస్ కుటుంబసభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయ కార్యనిర్వాహణ అధికారి(ఈవో) గీతారెడ్డికి రూ.50 లక్షల డీడీని అందజేశారు.
Tags :