నేడు రక్తదానం చేయండి

ఎన్టీఆర్‌ వర్ధంతి సందర్భంగా మంగళవారం తెలుగు రాష్ట్రాల్లో పెద్దఎత్తున లెజెండరీ రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నామని ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ మేనేజింగ్‌ ట్రస్టీ నారా భువనేశ్వరి ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు.

Updated : 18 Jan 2022 04:18 IST

నారా భువనేశ్వరి పిలుపు

ఈనాడు, హైదరాబాద్‌: ఎన్టీఆర్‌ వర్ధంతి సందర్భంగా మంగళవారం తెలుగు రాష్ట్రాల్లో పెద్దఎత్తున లెజెండరీ రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నామని ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ మేనేజింగ్‌ ట్రస్టీ నారా భువనేశ్వరి ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. ఎన్టీఆర్‌ భవన్‌లో మంగళవారం ఉదయం 10 గంటలకు రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు తెలుగుదేశం రాష్ట్ర మీడియా కార్యదర్శి ప్రకాశ్‌రెడ్డి తెలిపారు.

ఎన్టీఆర్‌ బాటలో నడవడమే ఆయనకు నివాళి: బక్కని
తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఎన్టీఆర్‌ పెంపొందించారని తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు బక్కని నర్సింహులు కొనియాడారు. ఎన్టీఆర్‌ 26వ వర్ధంతి సందర్భంగా పార్టీ రాష్ట్ర దళిత విభాగం రూపొందించిన 2022 నూతన సంవత్సర క్యాలెండర్‌ను సోమవారం ఎన్టీఆర్‌ భవన్‌లో ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్‌ చూపిన బాటలో నడవడమే ఆయనకు అందించే నిజమైన నివాళి అని చెప్పారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బండి పుల్లయ్య, ప్రధాన కార్యదర్శి అజ్మీరా రాజునాయక్‌, పి.అశోక్‌, శ్రీపతి సతీష్‌ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని