పోషకాలకు నెలవు మైక్రోగ్రీన్స్‌

రోజురోజుకు ఆహారం కలుషితం అవుతున్న వేళ ప్రజలకు ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగి పచ్చని,  తాజా కూరగాయలు,  ఆకుకూరలు తినడానికి మొగ్గు చూపుతున్నారు. ఇంట్లో పండించిన, పురుగుమందులు వాడని పంటలకు ప్రాముఖ్యత పెరుగుతోంది. ఇలాంటి  పరిస్థితుల్లో ఇటీవల మైక్రోగ్రీన్స్‌ వాడకం వెలుగులోకి వచ్చింది.

Published : 18 Jan 2022 04:25 IST

రోజురోజుకు ఆహారం కలుషితం అవుతున్న వేళ ప్రజలకు ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగి పచ్చని,  తాజా కూరగాయలు,  ఆకుకూరలు తినడానికి మొగ్గు చూపుతున్నారు. ఇంట్లో పండించిన, పురుగుమందులు వాడని పంటలకు ప్రాముఖ్యత పెరుగుతోంది. ఇలాంటి  పరిస్థితుల్లో ఇటీవల మైక్రోగ్రీన్స్‌ వాడకం వెలుగులోకి వచ్చింది. మైక్రోగ్రీన్స్‌ అనేవి 10-15 రోజుల వయస్సు కలిగిన వివిధ రకాలైన  ఆకుకూరలు. వీటిని బేబీ ప్లాంట్లుగా పరిగణిస్తారు. ఇవి పోషకాహారాన్ని మెరుగుపరచడానికే కాకుండా తినే పదార్థాల ఆకృతిని మెరుగుపరచడంలోనూ, రుచిని పెంచడంలోనూ సహాయపడతాయి. అత్యధిక పోషకాల లభ్యత వల్ల ప్రపంచ ఆరోగ్యసంస్థ వీటిని సూపర్‌ ఫుడ్‌గా ప్రకటించింది. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన మైక్రోగ్రీన్స్‌ను తక్కువ స్థలంలో ఎలా పెంచుకోవాలి? ఈ పద్ధతిలో ఏయే రకాల ఆకుకూరలు పండించుకోవచ్చు? వీటికి అవసరమైన విత్తనాలు ఎక్కడ లభిస్తాయి? పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటి? ఒక్కో పంట ఎన్నిరోజుల్లో చేతికొస్తుంది? తదితర వివరాలు జనవరి ‘అన్నదాత’లో మీకోసం.

మరెన్నో ఆసక్తికర కథనాలు అన్నదాత జనవరి-2022 సంచికలో...
* ‘అన్నదాత’ చందాదారులుగా చేరడానికి సంప్రదించాల్సిన ఫోన్‌ నెం: 9121157979, 8008522248
* ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు)

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని