
30వ తేదీ వరకు పరీక్షలన్నీ వాయిదా
జేఎన్‌టీయూ సహా యూనివర్సిటీల ఆదేశాలు
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాల పరిధిలో ఈ నెల 30వ తేదీ వరకు జరగాల్సిన పరీక్షలు వాయిదా పడ్డాయి. ఈ మేరకు ఆయా వర్సిటీలు ఆదేశాలు జారీ చేశాయి. కరోనా పరిస్థితుల దృష్ట్యా ఈ నెల 30వ తేదీ వరకు సెలవులు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో అన్ని విశ్వవిద్యాలయాల పరిధిలో పరీక్షలు వాయిదా వేయాలని ఉన్నత విద్యామండలి ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు తగ్గట్టుగా జేఎన్‌టీయూ పరిధిలో ఇంజినీరింగ్, ఫార్మసీ విద్యార్థులకు జరగాల్సిన అన్ని పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు రిజిస్ట్రార్ మంజూర్‌హుస్సేన్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. థియరీ, ప్రాక్టికల్స్ సహా మిడ్‌టర్మ్ పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిధిలో ఈ నెల 30 వరకు జరగాల్సిన అన్ని పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు వర్సిటీ అధికారులు ప్రకటించారు. బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో జరగాల్సిన పరీక్షలు వాయిదా వేశామని, తదుపరి తేదీలు త్వరలో ప్రకటిస్తామని పరీక్షల నియంత్రణాధికారి ఏవీఎన్‌రెడ్డి తెలిపారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.