అకాల వర్షాలతో 34 వేల ఎకరాల్లో పంటనష్టం

గత పది రోజుల వ్యవధిలో రాష్ట్రంలో కురిసిన అకాల వర్షాలకు 34 వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లు వ్యవసాయశాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. వరంగల్‌, హనుమకొండ, జయశంకర్‌ తదితర జిల్లాల్లో వడగండ్ల వానల కారణంగా మొక్కజొన్న, సెనగ, వేరుసెనగ, జొన్న, మిరప తదితర పంటలకు

Published : 18 Jan 2022 04:45 IST

ఈనాడు, హైదరాబాద్‌: గత పది రోజుల వ్యవధిలో రాష్ట్రంలో కురిసిన అకాల వర్షాలకు 34 వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లు వ్యవసాయశాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. వరంగల్‌, హనుమకొండ, జయశంకర్‌ తదితర జిల్లాల్లో వడగండ్ల వానల కారణంగా మొక్కజొన్న, సెనగ, వేరుసెనగ, జొన్న, మిరప తదితర పంటలకు ఎక్కువ నష్టం జరిగినట్టు తేల్చింది. ఉద్యానశాఖ పరిధిలో ఉన్న మిరప, కూరగాయలు, పసుపు తదితర పంటల నష్టాలపై ఈ శాఖ విడిగా అంచనాలు సిద్ధం చేస్తోంది. మిరప తోట సాగుకు రైతులు ఎకరానికి రూ.లక్షకు పైగా పెట్టుబడి పెట్టారు. వడగండ్లకు మిరపకాయలు రాలడంతోపాటు, చెట్లు నేలవాలడంతో అపారనష్టం వాటిల్లింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని