రాష్ట్రంలో ‘జనాగ్రహ’ సంస్థ సేవలు

బెంగళూరుకు చెందిన ‘జనాగ్రహ’ స్వచ్ఛంద సంస్థ తెలంగాణలో ప్రభుత్వ, పౌర భాగస్వామ్యంతో సేవా కార్యకలాపాలను నిర్వహించేందుకు మందుకొచ్చింది. సంస్థ సీఈవో శ్రీకాంత్‌

Published : 19 Jan 2022 03:36 IST

మంత్రి కేటీఆర్‌తో సమావేశమైన ప్రతినిధులు

ప్రగతిభవన్‌లో మంత్రి కేటీఆర్‌తో సమావేశంలో జనాగ్రహ సంస్థ సీఈవో శ్రీకాంత్‌ విశ్వనాథన్‌,

ప్రత్యేక సీఎస్‌ అర్వింద్‌కుమార్‌ తదితరులు

ఈనాడు, హైదరాబాద్‌: బెంగళూరుకు చెందిన ‘జనాగ్రహ’ స్వచ్ఛంద సంస్థ తెలంగాణలో ప్రభుత్వ, పౌర భాగస్వామ్యంతో సేవా కార్యకలాపాలను నిర్వహించేందుకు మందుకొచ్చింది. సంస్థ సీఈవో శ్రీకాంత్‌ విశ్వనాథన్‌ మంగళవారం పరిశ్రమలు, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్‌ను ప్రగతిభవన్‌లో కలిశారు. పౌర, ప్రజాస్వామిక కేంద్రం ద్వారా తాము కర్ణాటకలోని నగరాలు, పట్టణాల్లో నిర్వహిస్తున్న పౌరభాగస్వామ్య కార్యక్రమాలపై దృశ్యమాధ్యమ ప్రదర్శన ఇచ్చారు. దీనిపై తదుపరి సమావేశంలో తుది నిర్ణయం తీసుకుంటామని మంత్రి వారికి చెప్పారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు.

కేసీఆర్‌ చొరవతో దేశంలో మొదటి అటవీ, పర్యావరణ వర్సిటీ

హరితహారంతో పచ్చదనం పెంపునకు స్ఫూర్తిప్రదాతగా నిలిచిన సీఎం కేసీఆర్‌ చొరవతో దేశంలోనే తొలి అటవీ పర్యావరణశాస్త్రాల వర్సిటీ తెలంగాణలో ఏర్పాటవుతోందని మంత్రి కేటీఆర్‌ మంగళవారం ట్విటర్‌లో తెలిపారు. 

సర్కారు పాఠశాలలు మరింత బలోపేతం

తెలంగాణలోని 24 వేలకు పైగా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు, అభివృద్ధికి రూ. 7289 కోట్లతో చేపట్టిన మన ఊరు- మనబడి కొత్త కార్యక్రమం ప్రారంభించడం సీఎం కేసీఆర్‌ తీసుకున్న మరో గొప్ప నిర్ణయమని కేటీఆర్‌ మంగళవారం ట్విటర్‌లో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన విద్యాశాఖ మంత్రి సబితారెడ్డికి, యంత్రాంగానికి అభినందనలు తెలిపారు.

నేడు ఎమ్మెల్సీ కవిత, దామోదర్‌రెడ్డి ప్రమాణ స్వీకారం

శాసనమండలికి రెండోసారి ఎన్నికైన తెరాస సభ్యులు కల్వకుంట్ల కవిత, కూచికుళ్ల దామోదర్‌రెడ్డిలు బుధవారం ప్రమాణస్వీకారం చేయనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని