ఎన్‌టీఆర్‌తోనే తెలుగుకు ఖ్యాతి

తెలుగు భాష, సంస్కృతులకు అంతర్జాతీయ ప్రాభవం తీసుకొచ్చిన ఘనత ఎన్‌టీఆర్‌కే దక్కుతుందని సినీ నటుడు, హిందూపూరం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. తెదేపా

Published : 19 Jan 2022 03:36 IST

అమరజ్యోతి ర్యాలీలో బాలకృష్ణ ఘనంగా నివాళి

ఎన్‌టీఆర్‌ అమర జ్యోతితో సినీనటుడు బాలకృష్ణ, నందమూరి సుహాసిని, తెదేపా నాయకులు

బేగంపేట, న్యూస్‌టుడే: తెలుగు భాష, సంస్కృతులకు అంతర్జాతీయ ప్రాభవం తీసుకొచ్చిన ఘనత ఎన్‌టీఆర్‌కే దక్కుతుందని సినీ నటుడు, హిందూపూరం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. తెదేపా వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు వర్ధంతిని అఖిలభారత ఎన్‌టీఆర్‌ అభిమాన సంఘం ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించారు. బేగంపేట రసూల్‌పురా చౌరస్తాలోని ఎన్‌టీఆర్‌ విగ్రహం వద్ద అమరజ్యోతిని బాలకృష్ణ లాంఛనంగా వెలిగించారు. దివంగత నేతకు ఘనంగా నివాళులర్పించి, శాంతి కపోతాలను ఎగురవేశారు. ఆయన మాట్లాడుతూ, ఎన్నో సంక్షేమ పథకాలను ప్రారంభించి పేదలు, బలహీన వర్గాలకు సేవలందించిన ఎన్‌టీఆర్‌ ప్రతి ఒక్కరి హృదయంలో జీవించే ఉంటారన్నారు. మాజీ మంత్రి, దివంగత శ్రీపతి రాజేశ్వర్‌ ప్రారంభించిన అమరజ్యోతి ర్యాలీ కార్యక్రమాన్ని ఏటా ఘనంగా నిర్వహిస్తున్నందుకు అభినందించారు. ఎన్‌టీఆర్‌ అభిమాన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, తెదేపా తెలంగాణ రాష్ట్ర బీసీ సెల్‌ అధ్యక్షుడు శ్రీపతి సతీష్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి  నందమూరి సుహాసిని, మాజీ ఎమ్మెల్యేలు కొత్తకోట దయాకర్‌రెడ్డి, సీత దయాకర్‌రెడ్డి పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని