
Published : 20 Jan 2022 05:29 IST
విశ్రాంత ఐఏఎస్ రమేష్ తల్లిదండ్రులు, సోదరికి నోటీసులు
ఈనాడు, అమరావతి: విశ్రాంత ఐఏఎస్ అధికారి రమేష్ తల్లిదండ్రులు, సోదరికి విజయవాడ పటమట పోలీసులు బుధవారం నోటీసులు అందజేశారు. హైదరాబాద్ కొండాపూర్‌లో నివాసం ఉంటున్న ఆయన తల్లిదండ్రులు పెనుమాక సుబ్బారావు, మణికి స్వయంగా ఇచ్చారు. ఆయన సోదరి అరుణకు వాట్సప్‌లో పంపించారు. వరకట్న వేధింపుల కేసుకు సంబంధించి ఈనెల 22న తన ముందు హాజరు కావాలని పటమట సీఐ సురేష్‌రెడ్డి నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించి రమేష్ సోదరుడు రాజశేఖర్ జోషి... కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు. దీంతో ఆయనకు నోటీసులు ఇవ్వలేదు.
Tags :