ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో కొవిడ్‌ బాధితులకు వైద్యసేవలు ప్రారంభం

ఆంధ్రప్రదేశ్‌లో కొవిడ్‌ కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో వైద్యసేవలను తిరిగి ప్రారంభించినట్లు మేనేజింగ్‌ ట్రస్టీ నారా భువనేశ్వరి తెలిపారు. బుధవారం నుంచి రోజు ఉదయం 7 గంటలకు జూమ్‌ ద్వారా ఆన్‌లైన్‌లో కొవిడ్‌

Published : 20 Jan 2022 05:38 IST

ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కొవిడ్‌ కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో వైద్యసేవలను తిరిగి ప్రారంభించినట్లు మేనేజింగ్‌ ట్రస్టీ నారా భువనేశ్వరి తెలిపారు. బుధవారం నుంచి రోజు ఉదయం 7 గంటలకు జూమ్‌ ద్వారా ఆన్‌లైన్‌లో కొవిడ్‌ రోగులకు నిపుణుల ఆధ్వర్యంలో వైద్య సలహాలు అందిస్తున్నామని చెప్పారు.  తెదేపా అధినేత చంద్రబాబు కుప్పంలో ఆక్సిజన్‌ ప్లాంటును ప్రారంభించారన్నారు.శ్రీకాకుళం జిల్లా టెక్కలి, తెలంగాణలోని మహబూబాబాద్‌ జిల్లా గూడూరులో ప్లాంట్లు త్వరలో అందుబాటులోకి రానున్నాయని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని