సీబీఐ కోర్టు ఉత్తర్వులు సబబే

జగన్‌ అక్రమాస్తుల వ్యవహారంలో పెన్నా సిమెంట్స్‌ కేసులో ఏపీ ఐఏఎస్‌ వై.శ్రీలక్ష్మి పాత్రపై అదనపు అభియోగ పత్రాన్ని విచారణ నిమిత్తం పరిగణనలోకి (కాగ్నిజెన్స్‌) తీసుకుంటూ సీబీఐ కోర్టు

Published : 20 Jan 2022 05:38 IST

ఏపీ ఐఏఎస్‌ శ్రీలక్ష్మి పిటిషన్‌పై హైకోర్టుకు నివేదించిన సీబీఐ

ఈనాడు, హైదరాబాద్‌: జగన్‌ అక్రమాస్తుల వ్యవహారంలో పెన్నా సిమెంట్స్‌ కేసులో ఏపీ ఐఏఎస్‌ వై.శ్రీలక్ష్మి పాత్రపై అదనపు అభియోగ పత్రాన్ని విచారణ నిమిత్తం పరిగణనలోకి (కాగ్నిజెన్స్‌) తీసుకుంటూ సీబీఐ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులు సబబేనంటూ సీబీఐ బుధవారం హైకోర్టుకు నివేదించింది. పెన్నా కేసులో తనను నిందితురాలిగా పేర్కొంటూ సీబీఐ దాఖలు చేసిన అదనపు అభియోగ పత్రాన్ని సీబీఐ కోర్టు కాగ్నిజెన్స్‌కు తీసుకోవడాన్ని సవాలు చేస్తూ శ్రీలక్ష్మి పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ విచారణ చేపట్టగా... సీబీఐ తరఫు న్యాయవాది కె.సురేందర్‌ వాదనలు వినిపిస్తూ పిటిషనర్‌ ఇక్కడ కేవలం సీబీఐ కోర్టు నిర్ణయాన్ని సవాలు చేశారని, కేసులోని అంశాల గురించి కాదన్నారు.  అభియోగ పత్రాన్ని పరిశీలించాక ఎవరిని నిందితులుగా చేర్చాలి, ఎవరిని తొలగించాలన్నది కోర్టు విచక్షణపై ఉంటుందన్నారు. అన్ని అంశాలను పరిశీలించాకే సీబీఐ కోర్టు నిర్ణయం తీసుకుంటూ  ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. అదనపు అభియోగపత్రం దాఖలు చేసే అధికారం సీబీఐకి ఉందని స్పష్టంచేశారు. శ్రీలక్ష్మి తరఫు న్యాయవాది  వాదనలు వినిపిస్తూ సీబీఐ అభియోగాలకు ఆధారాలు లేవన్నారు. అందువల్ల సీబీఐ కోర్టు ఇచ్చిన కాగ్నిజెన్స్‌ ఉత్తర్వులను కొట్టివేయాలన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పు వాయిదా వేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని