
Published : 20 Jan 2022 06:05 IST
అపోహ వీడండి.. రెండో డోసూ మేలండి
ఏంటిలా వీరంతా ఒక్కచోట చేరి ఫోన్లలో మాట్లాడుతున్నారు అనుకుంటున్నారా..! వీరంతా ఆశా కార్యకర్తలు.. వారు మాట్లాడేది.. కరోనా టీకా మొదటి డోసు తీసుకుని, రెండో డోసుపై అలసత్వం చూపేవారితో.. పలువురు అపోహలతో టీకా రెండో డోసు వేయించుకోవడానికి ముందుకు రావటం లేదు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఆశా కార్యకర్తలను రంగంలోకి దించింది. వారు సదరు వ్యక్తులకు ఫోన్లు చేసి రెండో డోసు ఎందుకు అవసరమో నచ్చజెపుతూ అవగాహన కల్పిస్తున్నారు. ఆదిలాబాద్ శాంతినగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద కనిపించిందీ దృశ్యం.
- ఈనాడు, ఆదిలాబాద్. వైద్య విభాగం, న్యూస్టుడే
Tags :