Published : 20 Jan 2022 06:05 IST

ప్రభుత్వ ఉపాధ్యాయురాలికి జాతీయ స్థాయి పురస్కారం

 యంగ్‌ సైంటిస్ట్‌ అవార్డుకు ఎంపికైన పవిత్ర

గరిడేపల్లి, న్యూస్‌టుడే: భారత ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, విజ్ఞాన్‌ ప్రసార్‌ నెట్‌వర్క్‌, నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ టీచర్‌ సైంటిస్ట్‌, రామన్‌ సైన్స్‌, టెక్నాలజీ ఫౌండేషన్‌ సంయుక్తంగా అందించే ప్రతిష్ఠాత్మక యంగ్‌ సైంటిస్ట్‌ జాతీయ పురస్కారానికి సూర్యాపేట జిల్లా గడ్డిపల్లి జడ్పీహెచ్‌ఎస్‌ జీవశాస్త్ర ఉపాధ్యాయురాలు మారం పవిత్ర ఎంపికయ్యారు. సైన్స్‌, గణిత పాఠ్యాంశాల అప్పర్‌ ప్రైమరీ ఉపాధ్యాయుల విభాగంలో యువ శాస్త్రవేత్తల ఎంపిక కోసం గత ఏడాది జూన్‌లో నోటిఫికేషన్‌ విడుదల చేశారు. మూడు దశల్లో నిర్వహించిన పరీక్షల్లో ప్రతిభ చాటిన పవిత్ర జాతీయస్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచారని నిర్వాహకులు మంగళవారం ఆమెకు సమాచారం అందించారు. వివిధ రాష్ట్రాల నుంచి పదుల సంఖ్యలో ఉపాధ్యాయులు ఈ పురస్కారానికి పోటీ పడ్డారు. కన్సొలేషన్‌ బహుమతిని ఏపీలోని శ్రీకాకుళం జిల్లా రాజాం మండలంలోని కంచరం జడ్పీహెచ్‌ఎస్‌ ఉపాధ్యాయుడు పండూరు వేణుగోపాల్‌ సాధించారు. విజేతలకు ఫిబ్రవరి 28న సైన్స్‌డే సందర్భంగా అవార్డులు అందజేయనున్నారు.

Read latest State News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని