రూ.7411.52 కోట్లరైతుబంధు నిధుల జమ

రాష్ట్రంలో 62.99 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.7,411.52 కోట్ల రైతుబంధు నిధులు జమ చేసినట్లు వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 1,48,23,000 ఎకరాలకు ఈ నిధులు

Updated : 21 Jan 2022 06:27 IST

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో 62.99 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.7,411.52 కోట్ల రైతుబంధు నిధులు జమ చేసినట్లు వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 1,48,23,000 ఎకరాలకు ఈ నిధులు విడుదలయ్యాయన్నారు. అత్యధికంగా నల్గొండ జిల్లాలో 4,69,696 మందికి దాదాపు రూ.601 కోట్లు, సంగారెడ్డి జిల్లాలో 3,18,988 మందికి రూ.370 కోట్లు, నాగర్‌కర్నూల్‌ జిల్లాలో 2,77,920 మందికి రూ.367 కోట్లు జమయ్యాయన్నారు. 60శాతం జనాభా ఆధారపడిన వ్యయసాయ రంగం విషయంలో కేంద్రం ఒక జాతీయ విధానం అవలంబించడంతో పాటు ఉపాధిహామీని వ్యవసాయ రంగానికి అనుసంధానం చేయాలని కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని