పూర్తి స్థాయిలో ఆయకట్టుకు నీరందించేలా చర్యలు

భూసేకరణ, కోర్టు కేసులను పరిష్కరించుకొని పూర్తి స్థాయిలో ఆయకట్టుకు నీరందించేలా చర్యలు తీసుకుంటామని తెలంగాణ నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి రజత్‌కుమార్‌ తెలిపారు. ప్రధానమంత్రి కిసాన్‌ సంచిత్‌ యోజన( పి.ఎం.కె.ఎస్‌.వై) పథకం కింద ఆర్థిక సాయం అందుతున్న ప్రాజెక్టుల పనుల పురోగతిని

Published : 21 Jan 2022 05:56 IST

నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి రజత్‌కుమార్‌

  ఈనాడు, హైదరాబాద్‌ : భూసేకరణ, కోర్టు కేసులను పరిష్కరించుకొని పూర్తి స్థాయిలో ఆయకట్టుకు నీరందించేలా చర్యలు తీసుకుంటామని తెలంగాణ నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి రజత్‌కుమార్‌ తెలిపారు. ప్రధానమంత్రి కిసాన్‌ సంచిత్‌ యోజన( పి.ఎం.కె.ఎస్‌.వై) పథకం కింద ఆర్థిక సాయం అందుతున్న ప్రాజెక్టుల పనుల పురోగతిని కేంద్రజల్‌శక్తి కార్యదర్శి పంకజ్‌కుమార్‌ గురువారం వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లతో పాటు ఏడు రాష్ట్రాల అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. తెలంగాణ తరఫున రజత్‌కుమార్‌తో పాటు ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ మురళీధర్‌ పాల్గొన్నారు. సాగులోకి రావాల్సిన ఆయకట్టుకు, ఇప్పటివరకు వచ్చిన దానికి మధ్య ఉన్న తేడాను తగ్గించడానికి తీసుకుంటున్న చర్యల గురించి కేంద్ర జల్‌శక్తి కార్యదర్శి అడగ్గా భూసేకరణ, కోర్టు కేసులు, పునరావాసం తదితర సమస్యల వల్ల ఇబ్బందులు ఉత్పన్నమయ్యాయని, వీటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని రజత్‌కుమార్‌ తెలిపారు. దేవాదులలో డిస్ట్రిబ్యూటరీలకు భూసేకరణ సమస్యతో పాటు కొన్నిచోట్ల బ్రిడ్జిల పనులు పూర్తికాకపోవడం, భీమా ఎత్తిపోతలలో పునరావాసం, శ్రీరామసాగర్‌ వరదకాలువలో డిస్ట్రిబ్యూటరీ పనుల్లో జాప్యం తదితర అంశాలపై చర్చించారు. ఎస్సారెస్పీ-2లో ఖరీఫ్‌,రబీలో ఎక్కువ ఆయకట్టుకు నీరందించామని వివరించారు. వచ్చే సమావేశంలో ఆయకట్టు నిర్వహణ, నీటి యాజమాన్యంపై చర్చించనున్నట్లు కేంద్ర కార్యదర్శి తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ తరఫున జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి, ఇంంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ నారాయణరెడ్డి పాల్గొన్నారు. గుండ్లకమ్మ,తోటపల్లి ప్రాజెక్టుల గురించి చర్చ జరిగింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని