మేడారంపై త్వరలో సీఎం సమీక్ష

మేడారం సమ్మక్కసారలమ్మ జాతరపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ త్వరలో సమీక్ష నిర్వహించనున్నారు. జాతర ఏర్పాట్లు, భక్తులకు సౌకర్యాలు, కరోనా నేపథ్యంలో అనుసరించాల్సిన వైఖరిపై ఆయన చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.

Updated : 21 Jan 2022 06:27 IST

ఈనాడు, హైదరాబాద్‌: మేడారం సమ్మక్కసారలమ్మ జాతరపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ త్వరలో సమీక్ష నిర్వహించనున్నారు. జాతర ఏర్పాట్లు, భక్తులకు సౌకర్యాలు, కరోనా నేపథ్యంలో అనుసరించాల్సిన వైఖరిపై ఆయన చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ఇప్పటికే అక్కడి పరిస్థితులు, చేపట్టాల్సిన చర్యలపై వైద్యఆరోగ్యశాఖను ప్రభుత్వం నివేదిక కోరింది. కరోనా నిబంధనల అమలుపై అధికారులు కసరత్తులు చేస్తున్నారు. గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి గురువారం విలేకరులతో మాట్లాడుతూ, మేడారానికి ఇప్పటికే భక్తజన ప్రవాహం మొదలైందని, రోజుకు నాలుగు లక్షల మంది వస్తున్నారని తెలిపారు. కరోనాపై భక్తులను అప్రమత్తం చేస్తున్నామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని