ఆ గ్రామాల్లోని భూ సమస్య తేల్చండి

రైతు సమూహాలు ఎదుర్కొంటున్న భూ సమస్యలను వెంటనే గుర్తించాలని ప్రభుత్వం జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. ఈ మేరకు ఏడు అంశాలతో కూడిన ప్రొఫార్మాను జిల్లాలకు అందజేసింది. రాష్ట్రంలో కొన్ని గ్రామాల్లో ఎక్కువ మంది రైతులు ఒకే రకమైన సమస్యలు ఎదుర్కొంటున్నారని

Published : 21 Jan 2022 06:11 IST

జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశం

ఈనాడు, హైదరాబాద్‌: రైతు సమూహాలు ఎదుర్కొంటున్న భూ సమస్యలను వెంటనే గుర్తించాలని ప్రభుత్వం జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. ఈ మేరకు ఏడు అంశాలతో కూడిన ప్రొఫార్మాను జిల్లాలకు అందజేసింది. రాష్ట్రంలో కొన్ని గ్రామాల్లో ఎక్కువ మంది రైతులు ఒకే రకమైన సమస్యలు ఎదుర్కొంటున్నారని మొదట ఆ గ్రామాలేవో గుర్తించాలని, అక్కడున్న సమస్యను నమోదు చేయాలని సూచించింది. అధికారుల బృందాలను ఆ గ్రామాలకు పంపించాలని పేర్కొంది. ఎన్నేళ్ల నుంచి వారు ఆ సమస్యలతో బాధపడుతున్నారనేదీ నమోదు చేయాలని తెలిపింది. ఎంత విస్తీర్ణం సమస్యల్లో ఉంది, భూ యజమానుల సంఖ్య, సమస్య ఏ రకానికి చెందినది, ఎటువంటి చర్యలు తీసుకుంటే పరిష్కారం సులువుగా మారుతుందనేది కూడా సూచించాలని ఆదేశించింది.

పలు జిల్లాల్లో సమస్యలు
ఎక్కువ మంది రైతులు ఎదుర్కొంటున్న సమస్యల్లో ఆర్‌ఎస్‌ఆర్‌ సమస్యలు ప్రధానమైనవి. ఎక్కువ జిల్లాల్లో ఇవే ఉన్నట్లు రెవెన్యూ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మూల సర్వే నంబరులో ఉన్న రైతులు, భూ విస్తీర్ణాలకు భిన్నంగా కాలక్రమంలో నమోదైన విస్తీర్ణాలు, రైతుల సంఖ్యలతో ఈ సమస్య ఏర్పడుతోంది. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న సమస్యల్లో ఈ తరహావే ఎక్కువ శాతం ఉన్నాయి. ప్రస్తుతం వీటిపై అధికారులు దృష్టిసారించనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని