తిరుచానూరులో శ్రీయాగం ప్రారంభం

చిత్తూరు జిల్లా తిరుచానూరు శ్రీపద్మావతీ అమ్మవారి ఆలయంలో శుక్రవారం శ్రీయాగం ప్రారంభమైంది. ప్రపంచ శాంతి, సౌభాగ్యం కోసం తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి దంపతులు శ్రీయాగాన్ని స్వయంగా

Published : 22 Jan 2022 05:13 IST

50 ఏళ్ల తర్వాత మళ్లీ నిర్వహణ

తిరుచానూరు, తిరుమల, న్యూస్‌టుడే: చిత్తూరు జిల్లా తిరుచానూరు శ్రీపద్మావతీ అమ్మవారి ఆలయంలో శుక్రవారం శ్రీయాగం ప్రారంభమైంది. ప్రపంచ శాంతి, సౌభాగ్యం కోసం తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి దంపతులు శ్రీయాగాన్ని స్వయంగా నిర్వహిస్తున్నారు. వారం పాటు జరిగే ఈ కార్యక్రమంలో భాగంగా మొదటి రోజు ఉదయం యాగాన్ని ప్రారంభించారు. సుబ్బారెడ్డి దంపతులు అమ్మవారికి 34 గ్రా. బంగారు హారాన్ని కానుకగా అందజేశారు. 50ఏళ్ల కిందట చినజీయర్‌స్వామి తాతగారు శ్రీయాగం చేశారని, తర్వాత ఇంత కాలానికి అమ్మవారు తమకు యాగం చేసే భాగ్యాన్ని కల్పించారని సుబ్బారెడ్డి ఆనందం వ్యక్తంచేశారు. ఎస్వీబీసీ ద్వారా ప్రసారాలు తిలకించవచ్చన్నారు.

ముగియనున్న శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం: ఈనెల 13న ప్రారంభమైన తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం శనివారంతో ముగియనుంది. గురువారం 36,092మంది భక్తులు దర్శించుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని