
Published : 23 Jan 2022 04:33 IST
గాలి స్వచ్ఛత కోసం రాష్ట్ర కమిటీ ఏర్పాటు
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో పది లక్షలకుపైగా జనాభా ఉన్న నగరాల్లో గాలిలో స్వచ్ఛత ఉండేలా పర్యవేక్షించేందుకు రాష్ట్రస్థాయి కమిటీని ఏర్పాటు చేస్తూ పర్యావరణశాఖ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. నగరాల్లో గాలిలో కాలుష్యం లేకుండా చూడాలని 15వ ఆర్థిక సంఘం సిఫార్సు చేసింది. దీంతో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన రాష్ట్రస్థాయి కమిటీని ఏర్పాటు చేశారు. మరో 8 మంది ఉన్నతాధికారులు సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీ ఆర్నెల్లకోసారి సమావేశమై 15వ ఆర్థిక సంఘం సిఫార్సు అమలుపై చర్చించాలి.
Tags :