
Updated : 23 Jan 2022 07:45 IST
Weather Forecast: తెలంగాణలో నేడు ఓ మోస్తరు వర్షాలు
ఈనాడు, హైదరాబాద్: ఈశాన్య రుతుపవనాలు దక్షిణ భారతదేశం నుంచి పూర్తిగా వెనక్కి వెళ్లిపోయాయని వాతావరణశాఖ తెలిపింది. పశ్చిమ, దక్షిణ భారత ప్రాంతాల నుంచి తక్కువ ఎత్తులో గాలులు తెలంగాణ వైపు వీస్తున్నాయంది. వీటి ప్రభావంతో ఆదివారం అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశమున్నట్లు పేర్కొంది. కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రత బాగా తగ్గడం వల్ల చలి తీవ్రత పెరిగింది. శనివారం తెల్లవారుజామున అత్యల్పంగా రెడ్డిపల్లి(రంగారెడ్డి జిల్లా)లో 10.3 డిగ్రీలు నమోదయింది. ఉదయం పూట కొన్ని ప్రాంతాల్లో పొగమంచు కురుస్తోంది. గాలిలో తేమ సాధారణంకన్నా 17 శాతం అధికంగా ఉంది.
Tags :