
Published : 23 Jan 2022 04:38 IST
గజ్వేల్‌లో క్రీడా సముదాయం
20 ఎకరాలు కేటాయిస్తూ ఉత్తర్వులు
ఈనాడు, హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న శాసనసభ నియోజకవర్గ కేంద్రం గజ్వేల్‌లో క్రీడాసముదాయం ఏర్పాటుకు 560/1 సర్వే నంబరులోని 20 ఎకరాల భూమిని కేటాయిస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. గజ్వేల్‌లో క్రీడారంగ అభివృద్ధిపై సీఎం ప్రత్యేక దృష్టి సారించారు. ఆయన ఆదేశాల మేరకు క్రీడల మంత్రి శ్రీనివాస్‌గౌడ్ క్రీడాభివృద్ధికి ప్రణాళిక సిద్ధం చేశారు. తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ (సాట్స్) ఛైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్‌రెడ్డి క్రీడా ప్రాంగణానికి అవసరమైన స్థలాన్ని సందర్శించి ప్రభుత్వానికి నివేదించడంతో రెవెన్యూ అధికారులు దాన్ని క్రీడాశాఖకు కేటాయించారు. అక్కడ త్వరలోనే రాష్ట్రానికి ఆదర్శంగా నిలిచే క్రీడా సముదాయం ఏర్పాటవుతుందని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు.
.
Tags :