త్వరలో అర్చక సంక్షేమ మండలి ఏర్పాటు

అర్చక సంక్షేమ మండలిని త్వరలో ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. కారుణ్య నియామకాల కింద పని చేస్తున్న అర్చకులు, ఉద్యోగులకు దేవాలయాల

Published : 23 Jan 2022 04:45 IST

దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి

ఈనాడు, హైదరాబాద్‌: అర్చక సంక్షేమ మండలిని త్వరలో ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. కారుణ్య నియామకాల కింద పని చేస్తున్న అర్చకులు, ఉద్యోగులకు దేవాలయాల నుంచి కాకుండా గ్రాంట్‌-ఇన్‌-ఎయిడ్‌ ద్వారా వేతనాలు అందజేస్తామని చెప్పారు. అర్చక, ఉద్యోగ సంఘాల నాయకులు ఇటీవల కేటీఆర్‌ను కలిసి వారి సమస్యలపై వినతి పత్రం అందజేశారు. ఆ మేరకు మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి శనివారం హైదరాబాద్‌లోని అరణ్యభవన్‌లో సంఘం ప్రతినిధులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అర్చకుల జీతాలకు సంబంధించి గతంలో జారీ చేసిన 121 జీవోను రద్దు చేసే అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామన్నారు. మరో 2,840 ఆలయాలకు ధూప, దీప నైవేద్య పథకం కింద నిధుల విడుదలకు, రెండేళ్లకోసారి అర్చక పరీక్షలు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. సమావేశంలో దేవాదాయ శాఖ అధికారులు అనిల్‌కుమార్‌, కృష్ణవేణి, అర్చక సంఘాల ప్రతినిధులు ఉపేంద్రశర్మ, రవీంద్రాచారి, కృష్ణమాచారి, బదరీనాథాచార్యులు, చంద్రశేఖరశర్మ, రాజేశ్వరశర్మ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని